Sunday, November 28, 2010

సేమియా పాయసం

హాయ్ ,గత రెండేళ్ళు గ బ్లాగ్స్  చదవడం అలవాటు అయ్యింది . అయ్య బాబోయ్ మొదటి లైన్ రాయడానికే  ఎన్ని సార్లు backspace కొట్టేసాను. నేను నా వంటలు ఎప్పుడు పోస్ట్ చేయగలనబ్బ.. చూద్దాం ఇవాళ ఈజీ గ అనిపిస్తే కంటిన్యూ చేసేద్దాం  లేదంటే వదిలేద్దాం అనుకోని స్టార్ట్ చేస్తున్నాను . ప్లీజ్ విష్ me .   మొదటి పోస్ట్ కావున  ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడదాం.
గమనిక :
1 .ఇక్కడ quantities కరెక్ట్ గ ఇవ్వలేను ఎందుకంటే నేను కూడా learner సో ప్లీజ్ అడ్జస్ట్  అవ్వండి .

కావలసిన పదార్థాలు
------------------------
సేమియా - 1  గ్లాస్
చక్కర    - ౩/4 గ్లాస్(స్వీట్ అంటే ఎక్కువ ఇష్టపడేవారు 1  గ్లాస్ వేసుకోవచ్చు )
పాలు     - 1 /2  lt
నెయ్యి    - సేమియా + dry fruits   వేయించడనికి   సరిపడా .
కిస్మిస్,బాదాం,గోడంబి -5 +5 +5

preparation:
----------------------
ముందుగా dryfruits ని ఒక స్పూన్ నెయ్యి లో వేయించుకొని అదే గోళం లో ఇంకొద్దిగా నెయ్యి ఆడ్ చేసి సేమియా వేయించి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు పాలు  వేడి  చేసుకునే పాత్ర లో పాలు ఇంకొన్ని వాటర్  ఆడ్ చేయండి .సిం లో పెట్టి బాగామరగానివ్వండి  ఇప్పుడు సేమియా వేసి  పాలలో , సేమియా మెత్తబడే వరకు బాయిల్ చేయండి .......ఇప్పుడు షుగర్ ఆడ్ చేయండి ఇంకొద్ది సేపు అలాగే సిం లో పెట్టండి ( స్టవ్  హై లో పెట్టేస్తే పాలు విరిగిపోయి ఉండలు ఉండలు గ వస్తుంది సో షుగర్ వేసిన తరువాత కొద్దిసేపు మాత్రమే సిం లో పెట్టాలి ). చివరిగా వేయించి పెట్టుకున్న dryfruits ఆడ్ చేయండి  అంతే ..  tasty   సేమియా పాయసం రెడీ . ఫోటో ప్రస్తుతానికి ఆడ్ చేయలేదు నెక్స్ట్ టైం ఆడ్ చేస్తాను.
కొంచెం ఈజీ గ నే వుంది పోస్ట్ రాయడం సో కంటిన్యూ చేసేద్దాం అని డిసైడ్ అయ్యానోచ్ ... :)
పైన పెట్టిన ఫోటో నాది కాదు ..నా పాయసం చూడటానికి (తినడానికి కూడా ) ఇంకా బాగుంటుంది . గూగుల్ ని అడిగితి ఇది పెట్టేసుకో పో అని ఆ ఫోటో ఇచ్చింది .